అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తమ బి-ఫారాలను ఈ నెల 3వ తేదీ సాయంత్రం 3 గంటలలోపు తప్పనిసరిగా సమర్పించాలని కమిషనర్ బి. నాగరాజు ఆదివారం తెలియజేశారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను లేదా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. 3వ తేదీ సాయంత్రం 3 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితాను కార్యాలయ నోటీసు బోర్డుపై అధికారికంగా ప్రదర్శిస్తామని వివరించారు.