అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 21, 22వ వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయార్థం మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శనివారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. వార్డు అభ్యర్థులు ఏలేటి పార్వతి, జుజ్జువరపు శ్రీరామ్మూర్తిలను ప్రజలకు పరిచయం చేస్తూ, మున్సిపాలిటీ ఎన్నికలలో బీఆర్ఎస్ ను గెలిపించి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.