అశ్వారావుపేట: డ్రైనేజీ సమస్యలపై కమిషనర్కు ఫిర్యాదు

0చూసినవారు
అశ్వారావుపేట: డ్రైనేజీ సమస్యలపై కమిషనర్కు ఫిర్యాదు
అశ్వారావుపేట మున్సిపాలిటీ 14వ వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ కౌన్సిలర్ బి. ఉదయ జ్యోతి బుధవారం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. డ్రైనేజీ నీరు నిల్వ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దుర్వాసనతో పాటు దోమల సమస్య పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్