అశ్వారావుపేట: అన్నదాతలు పంట మార్పిడిపై దృష్టి సారించాలి

1చూసినవారు
అశ్వారావుపేట మండలం తిరుమలకుంటలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సేంద్రీయ సాగు, పంట మార్పిడి పద్ధతులపై అన్నదాతలు దృష్టి సారించాలన్నారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎరువుల వాడకం తగ్గించి, సాగునీటిని ఆదా చేస్తూ అధిక దిగుబడులు సాధించాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ఆధునిక సాగు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్