అశ్వారావుపేటలోని మల్లాయిగూడెం గ్రామంలో జరుగుతున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ఆరో రోజుకు చేరుకుంది. మంగళవారం, నారాయణపురం పశు సంవర్ధక శాఖ వైద్యాధికారి డాక్టర్ వినయ్ ఆధ్వర్యంలో మూగజీవాలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. పశువులకు కృత్రిమ గర్భధారణతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.