అశ్వారావుపేటలోని యంగ్
ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ శనివారం పరిశీలించారు. నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి, పనుల నాణ్యత, పురోగతి, భవనాల నమూనా మ్యాపులను ఆయన సమీక్షించారు. విద్యార్థులకు అత్యుత్తమ విద్యా వాతావరణం కల్పించేలా అన్ని ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణాలు చేపట్టాలని, పాఠశాల ప్రాంగణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.