అశ్వారావుపేట గిరిజన భవన్ లో శనివారం జరిగిన జానపద కళాకారుల సమ్మేళనంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. జానపద కళాకారుల సమ్మేళనంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం వారి కృషిని వివరించారు. 12వ తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సమ్మేళనం జిల్లా ఉపాధ్యక్షుడు ముర్తుజా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, జానపద కళాకారులు పాల్గొన్నారు.