అశ్వారావుపేట మండలం అనంతారంలో దొంగిలించబడిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న నాగు అనే వ్యక్తిని ఎస్ఐ కె. అఖిల తన సిబ్బందితో కలిసి తనిఖీల్లో పట్టుకున్నారు. విచారణలో, అతను మధ్యాహ్నం ఇంట్లో బయట ఉన్న మోటార్ సైకిల్ను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి మంగళవారం కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్. హెచ్. ఓ యయాతి రాజు తెలిపారు.