పేకాట స్థావరంపై పోలీసులు గురువారం దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అశ్వారావుపేట నారంవారిగూడెం కాలనీ సమీపంలోని ఒక తోటలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసినట్లు ఎస్సై యయాతిరాజు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు జూదరులను అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 3, 100 నగదు, ఆటో, రెండు మొబైల్స్, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నామన్నారు.