అశ్వారావుపేట: కేజీబీవీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

55చూసినవారు
అశ్వారావుపేట: కేజీబీవీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి
కేజీబీవీ విద్యాలయాల్లో టీచర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారు మిగిలిన ఉపాధ్యాయులతో పోల్చితే తక్కువ వేతనం అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేజీబీవీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని బుధవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలను విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారుల వద్ద విషయాన్ని ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్