ఖమ్మం జాతీయ రహదారిలోని అశ్వారావుపేట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టిప్పర్ లారీ కారును ఓవర్టేక్ చేసే క్రమంలో కారు, టిప్పర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో కారు అడ్డంగా రోడ్డుపై ఆగిపోయింది. ఎదురుగా వస్తున్న ఐరన్ చువ్వల లారీ సడన్ బ్రేక్ వేయడంతో, లారీలోని ఇనుప చువ్వలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ సంఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.