అశ్వారావుపేట: నిబంధనలు పాటించాలి

74చూసినవారు
అశ్వారావుపేట: నిబంధనలు పాటించాలి
వైద్యారోగ్య శాఖ నిబంధనలకు లోబడే ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించాలని, రిజిస్ట్రేషన్ తప్పని సరిగా చేయించుకోవాలని డీఎంహెచ్వో, డాక్టర్ భాస్కర్ నాయక్ ప్రైవేటు వైద్యులకు సూచించారు. జిల్లా వైద్య బృందం బుధవారం అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రులను, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్