అశ్వారావుపేట పట్టణంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత నాలుగు రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న గ్రామ దీపికల దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నాయకులతో కలిసి సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. గ్రామ దీపికలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆవేదనను ఆయన అడిగి తెలుసుకుని అనంతరం
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.