అశ్వారావుపేటలో మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురు వ్యక్తులకు దమ్మపేట న్యాయస్థానం మూడు రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా విధించింది. ఆరు నెలల క్రితం వాహన తనిఖీల్లో భాగంగా వీరిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై యయాతి రాజు తెలిపారు. గురువారం వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా ఈ తీర్పు వెలువడింది.