అశ్వారావుపేట మండలంలోని కొత్తమామిళ్లవారిగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి పిడుగుపాటుకు ఒక తాటి చెట్టు దగ్ధమైంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్న సమయంలో పొలం గట్టుపై ఉన్న తాటి చెట్టుపై పిడుగు పడటంతో అది ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.