భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓ పెళ్లిలో వింత ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ కొరత తీవ్రంగా ఉండటంతో, బీఆర్ఎస్ నాయకుడు మోహన్ పెళ్లిలో నూతన వధూవరులకు రెండు లీటర్ల పెట్రోల్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ సంఘటనతో వాహనదారులు డీజిల్, పెట్రోల్ దొరక్క అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొంది.