అశ్వారావుపేట: రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్

0చూసినవారు
అశ్వారావుపేట: రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
అశ్వారావుపేట మండలం అనంతారం వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం తహసీల్దార్ రామకృష్ణ, ఎస్సై యయాతి రాజు పట్టుకొని సీజ్ చేశారు. పట్టుబడిన ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్