నకిలీ మొక్కలు నాటి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయిల్ ఫామ్ రైతులు ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డికి, ఇన్ఛార్జ్ డీ. ఓ నాయుడు రాధా క్రిష్ణకు మంగళవారం వినతిపత్రం అందించారు. 2016 నుంచి 2022 మధ్య కాలంలో ఆయిల్ ఫామ్ తోటలు నాటిన వాటిల్లో దాదాపుగా 50 శాతం పైగా కాపు రాని, కాపు వచ్చినా పెరుగుదల లేని గెలలతో ఆర్థికంగా నష్టపోతున్నామని పేర్కొన్నారు.