అశ్వారావుపేట: ఉపాధిలో పనుల్లో వివాహ వేడుకలు

2చూసినవారు
అశ్వారావుపేట మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన ఆకుల శ్రీను-దుర్గ దంపతులు, ఉపాధి హామీ పథకం కూలీలుగా పనిచేస్తున్నారు. శనివారం, వారి వివాహమై పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా, వారు పనిచేస్తున్న పని ప్రదేశంలోనే వివాహ వేడుకను జరుపుకున్నారు. తోటి కూలీలు ఈ వేడుకలో పాల్గొని, దంపతులకు పూలు, దండలు మార్పించి, స్వీట్లు పంపిణీ చేశారు. పని ప్రదేశమే వారి ఆనందానికి వేదికగా మారింది.

సంబంధిత పోస్ట్