దేదో పాడుబడిన భవనం అనుకుంటే పొరపాటే. అశ్వారావుపేట మండలం సున్నంబట్టిలోని ఉప పశు చికిత్సాలయం ఇది. అటెండర్లు లేరు. వెటర్నరీ లైవ్ స్టాక్ అసిస్టెంటు అనారోగ్యంతో ఏడాదిన్నరగా విధులకు హాజరు కావడం లేదు. దీంతో పిచ్చి మొక్కలతో ఇలా తయారైంది. 15 గిరిజన గ్రామాల రైతుల పశువులకు చికిత్స అందించాల్సిన కేంద్రం ఇది. మండల పశువైద్యాధికారిని సంప్రదించగా సిబ్బంది కొరత కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోతున్నట్లు తెలిపారు.