సైబర్ నేరాలపై అవగాహన: DSP సతీష్ కుమార్ కీలక సూచనలు

7చూసినవారు
సైబర్ నేరాలపై అవగాహన: DSP సతీష్ కుమార్ కీలక సూచనలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలోని వ్యవసాయ కళాశాలలో బుధవారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్వంచ DSP ఆర్. సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేయడానికి డిజిటల్ అరెస్ట్ స్కామ్, పోలీసులమని, CBI, ED అధికారులమని వీడియో కాల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇది పూర్తిగా మోసమని DSP తెలిపారు. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్ లో అరెస్ట్ చేయరని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్