భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలైన కావడిగుండ్ల, కంట్లం, గోగులపూడి, గుబ్బలమంగమ్మ ఆలయ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ఆదివారం గుర్తించారు. గతంలో పశువులపై దాడి చేసిన ఈ పులిని పాపికొండలు అభయారణ్యంలోకి తరలించినా, మళ్ళీ ఇదే ప్రాంతానికి వచ్చినట్లు తెలిపారు. కావడిగుండ్ల, గుబ్బలంగమ్మ సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించిన పులిపై నిఘా పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.