రైస్ మిల్లులో చేయి కోల్పోయిన కార్మికుడికి బిఆర్ఎస్ నాయకుల సాయం

2చూసినవారు
రైస్ మిల్లులో చేయి కోల్పోయిన కార్మికుడికి బిఆర్ఎస్ నాయకుల సాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన మడకం ప్రసాద్ (37) మూడు నెలల క్రితం దమ్మపేట మండలంలోని ఓ రైస్ మిల్లులో పని చేస్తుండగా యంత్రంలో చేయి చిక్కి తీవ్రంగా గాయపడి ఒక చేయి కోల్పోయాడు. కుటుంబ భారం ఇబ్బందిగా మారడంతో, బిఆర్ఎస్ నాయకులు తక్షణ అవసరాల కోసం రూ. 5 వేల ఆర్థిక సాయం ఆదివారం అందించారు.