చంద్రుగొండ: దత్తత గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

84చూసినవారు
చంద్రుగొండ: దత్తత గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దత్తత గ్రామం మండలంలోని మహమ్మద్ నగర్ లో శుక్రవారం పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం తిప్పనపల్లి గ్రామాన్ని సందర్శించి స్థానిక సమస్యలను ఎమ్మెల్యే ప్రజలను అడిగి తెలుసుకున్నారు.