చండ్రుగొండ: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన

4చూసినవారు
చండ్రుగొండ: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన
ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చండ్రుగొండలో గురువారం నిర్వహించిన గ్రామ సభకు జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం మార్చి 6వ తేదీ నుండి అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా అమలు చేయబడుతోందని తెలిపారు. గ్రామస్థుల సమస్యలను ఆలకించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్