చంద్రుగొండ: రేషన్ బియ్యం లారీ సిజ్

3చూసినవారు
చంద్రుగొండ: రేషన్ బియ్యం లారీ సిజ్
సోమవారం చంద్రుగొండలో పోలీసులు అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యం లారీని పట్టుకున్నారు. పౌరసరఫరాలశాఖ డీటీ వెంకటేశ్వరరావు, చంద్రుగొండ ఎస్ఐ శివరామకృష్ణల తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్కు తరలిస్తున్న బియ్యం లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీలో పైన మంచి బియ్యం, కింద రేషన్ బియ్యం బస్తాలు ఉన్నాయని తెలిపారు. సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్