చండ్రుగొండ: రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్

2చూసినవారు
చండ్రుగొండ: రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
చండ్రుగొండ మండలంలోని రేపల్లెవాడలో మంగళవారం ఎటువంటి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్ఐ శివరామకృష్ణ సీజ్ చేశారు. గానుగపాడు-రేపల్లెవాడ మధ్య ఎదుళ్లవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :