మట్టి వినాయక విగ్రహాలనే ప్రోత్సహించాలి: తహసీల్దార్ మురళి

1859చూసినవారు
మట్టి వినాయక విగ్రహాలనే ప్రోత్సహించాలి: తహసీల్దార్ మురళి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని బంజారా కాలనీలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడి ఉత్సవ మండపాలను ఎస్‌డీసీ (యూటీ) తహసీల్దార్ మద్దినేని మురళి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మట్టి గణపతి విగ్రహాల వినియోగం పర్యావరణహితమని, ప్రజలు వీటినే ప్రోత్సహించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నివారించాలని సూచించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మురళిని శాలువాతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్