దమ్మపేట మండలం గట్టుగూడెం గ్రామంలో నకిలీ మొక్కజొన్న విత్తనాలతో పంట నష్టపోయిన రైతు పొలాన్ని నియోజకవర్గం
బీజేపీ నాయకులు తంబళ్ల రవి శనివారం పరిశీలించారు. దార ప్రసాద్ అనే రైతుకు ఒక సీడ్ కంపెనీ నకిలీ విత్తనాలు ఇచ్చి ఆర్థికంగా నష్టపరిచిందని, స్థానిక వ్యవసాయ అధికారులు స్పందించి వారిని కఠినంగా శిక్షించి, రైతుకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.