దమ్మపేట మండలంలోని నాచారం గ్రామానికి చెందిన డేరంగుల నాగరాజు (35) గత నెల 24న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. వ్యక్తి అదృశ్యంపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. అదృశ్యమైన వ్యక్తి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి తెలిపారు.