దమ్మపేట: అప్పుల బాధతో మాజీ ఎంపీటీసీ ఆత్మహత్య

50చూసినవారు
దమ్మపేట: అప్పుల బాధతో మాజీ ఎంపీటీసీ ఆత్మహత్య
దమ్మపేట మండలం మందలపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ నాయకుడు మడిపల్లి శ్రీను కలుపు మందు తాగి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయానికి చేసిన అప్పు భారం కావడంతో, మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్