కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షతో సాగిస్తున్న కుతంత్రాలను నిరసిస్తూ ఆదివారం దమ్మపేట నుంచి మందలపల్లి వరకు మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నాయకులతో కలిసి నల్ల బ్యాడ్జీలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. తెలంగాణ కోసం పోరాడిన నాయకుడిపై అక్రమంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.