దమ్మపేట: పేకాట ఆడుతున్న వ్యక్తి అరెస్ట్

0చూసినవారు
దమ్మపేట: పేకాట ఆడుతున్న వ్యక్తి అరెస్ట్
దమ్మపేట మండలంలోని రంగువారిగూడెం శివారులో ఆదివారం పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పామాయిల్ తోటలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ బి. రాజేశ్ కుమార్ సిబ్బందితో కలిసి దాడి చేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురు పరారయ్యారు. ఘటనా స్థలంలో ఐదు బైక్ లు, రూ. 4, 310 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :