దమ్మపేట: ఆయిల్ ఫామ్ సాగు రైతులకు లాభ దాయకం

57చూసినవారు
దమ్మపేట: ఆయిల్ ఫామ్ సాగు రైతులకు లాభ దాయకం
జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గురువారం దమ్మపేట మండలం దురదపాడు, లింగంపాడు గ్రామాలలో మెగా ఆయిల్ ఫామ్ డ్రైవ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 63 మంది రైతులు 147 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సాగు రైతులకు ఆర్థికంగా లాభదాయకమని, దేశీయ ఆయిల్ ఉత్పత్తిలో వృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్