దమ్మపేట: ఇసుక లారీ సీజ్

3చూసినవారు
దమ్మపేట: ఇసుక లారీ సీజ్
ఎటువంటి అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు ఇసుక తరలిస్తున్న లారీని దమ్మపేట పోలీసులు సోమవారం సీజ్ చేశారు. ఏపీలోని కొవ్వూరు నుండి దమ్మపేట మండలానికి వస్తున్న ఇసుక లారీని మందలపల్లి వద్ద తనిఖీ చేయగా, అనుమతి లేదని తేలింది. దీంతో వాహనాన్ని సీజ్ చేసి, బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్ కుమార్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్