దమ్మపేటలో గాలివానల వల్ల నష్టపోయిన మామిడి రైతులను బిజెపి నాయకులు తంబళ్ల రవి గురువారం పరామర్శించారు. అకాల వర్షం వల్ల మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, చేతికొచ్చిన పంట చేజారిపోవడంతో రైతులు ఆర్థికంగా కుంగిపోతున్నారని వారు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం మామిడి రైతులకు తక్షణమే ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.