దమ్మపేట: ప్రతి గ్రామంలో మేడే జెండా ఎగరాలి

2చూసినవారు
దమ్మపేట: ప్రతి గ్రామంలో మేడే జెండా ఎగరాలి
కోట్లాదిమంది శ్రామికులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన మేడేను అన్ని కార్మిక రంగాల్లోనూ ఘనంగా నిర్వహించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ పిలుపునిచ్చారు. బుధవారం దమ్మపేటలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో ఎర్ర జెండాలు ఎగరేసి, కార్మిక హక్కుల కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించాలని కోరారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం కోసం కార్మికులు ఐక్యంగా పోరాడాలని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్