దమ్మపేట పోలీసులు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ కేసును ఛేదించారు. శనివారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 90 కిలోల కాపర్ వైర్లు, వైర్ కట్టర్లు, మూడు సెల్‌ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కాకినాడ జిల్లా వాసులని పోలీసులు గుర్తించారు. దమ్మపేట, కరకగూడెం, ములకలపల్లి, ఈ. బయ్యారం గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లు దొంగిలించినట్లు వెల్లడించారు.