పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు సవరించి కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సీఐటీయూ దమ్మపేట మండల కన్వీనర్ మురహరి రఘు డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2021లో కనీస వేతనాలు సలహా మండలి పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలను పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించే జీవోలు విడుదల చేయాలని కోరారు.