
ఎన్ని బిందెల నీళ్లు పోసినా మింగేస్తున్న శివలింగం.. అంతుచిక్కని రహస్యం!
TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో సుప్రసిద్ధమైన కాళేశ్వర ఆలయం ఉంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ ఒకే పీఠంపై (పానవట్టంపై) కాళేశ్వర, ముక్తేశ్వర స్వామివార్లు పూజలందుకుంటున్నారు. ఈ ఆలయంలోని ముక్తేశ్వర లింగానికి శిరస్సు భాగంలో 2 నాసికా రంధ్రాలు ఉండటం విశేషం. స్వామివారికి ఎన్ని వేల బిందెల నీటితో అభిషేకం చేసినా, ఆ నీరంతా నాసికా రంధ్రాల ద్వారా లోపలికి వెళ్లిపోతుంది. ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది. #Hidden Secrets of Telugu Temples ద్వారా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు ఇలాంటి ఆలయ విశేషాలు తెలుసుకోవచ్చు.




