భద్రాద్రి కొత్తగూడెంలో ముమ్మరంగా వరద సహాయక చర్యలు

1చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మురుసు తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తహసీల్దార్ మరియు ఎస్‌డీసీ ట్రైనింగ్ అధికారి మద్దినేని మురళి క్షేత్రస్థాయిలో చురుకుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను బుధవారం స్వయంగా పరిశీలిస్తూ, బాధితులను పరామర్శిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేయడమే కాకుండా, సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు. అధికారుల ఈ తక్షణ స్పందనపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్