భద్రాద్రి జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి స్థానికులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలు, దేవాలయాలు, గృహ సముదాయాల మధ్య కొనసాగుతున్న మద్యపాన బెల్ట్ షాపులను తొలగించాలని స్థానిక గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రూపా రాంబాబు, పానుగంటి లక్ష్మణ్ గౌడ్, దారా యుగంధర్, దారా మల్లికార్జునరావు, సతీష్, మనోజ్, శ్రీను తదితరులతో పాటు ఆర్యవైశ్య సోదరులు పాల్గొన్నారు.