భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం గండుగులపల్లి పంచాయతీ రెడ్యాలపాడు గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి మంగళవారం అన్నదానం నిర్వహించారు. గణనాథుడిని గ్రామంలో ఊరేగించి నిమజ్జనం చేశారు. లడ్డూ వేలంలో ఊకె రవి రూ. 40,116కు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెచ్చు ఈదప్ప, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.