భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలోని దమ్మపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం వీబీ-జీ రామ్-జీ పథకంపై గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ పగడాల రమాదేవి, ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, కార్యదర్శి కొల్లు దుర్గారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడి చిత్రపటానికి నివాళులర్పించారు. పథకం కింద గ్రామ అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని వివరించారు. గ్రామస్తులు దమ్మపేట బస్టాండ్‌ను విస్తరించి అభివృద్ధి చేయాలని, పంచాయతీ అనుమతులు లేకుండా నిర్మించిన పెట్రోల్ బంక్‌ను తొలగించాలని కోరారు. అయితే, బస్టాండ్‌లోని పెట్రోల్ బంక్‌ను తొలగించే అధికారం పంచాయతీకి లేదని, అది ఆర్టీసీ పరిధిలోనిదని సర్పంచ్ తెలిపారు.