పెంచిన యూపీఐ చార్జీలు ఉపసంహరించాలి: సీఐటీయూ

2చూసినవారు
పెంచిన యూపీఐ చార్జీలు ఉపసంహరించాలి: సీఐటీయూ
పెంచిన యూపీఐ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. శనివారం రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సీఐటీయూ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యూపీఐపై చార్జీలు విధించడం సామాన్యులు, రైతులు, చిన్న వ్యాపారులు, అసంఘటిత కార్మికులపై అదనపు ఆర్థిక భారమని అన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించిన ప్రభుత్వం చార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మురారి రఘు, విక్రమ్, బాబురావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్