భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి 10 గంటల వరకు కూడా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంతో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ వినతి పత్రాల స్వీకరణ జరిగింది.