దమ్మపేట మండల కేంద్రంలోని నూతన పోలీస్ స్టేషన్ ను గురువారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడారు. అనంతరం పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.