ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే రవి జూనియర్ న్యాయవాదిగా పని చేస్తున్నారు. తమ్మిశెట్టి గురవరాజుకు సంబంధించిన నివాస స్థలం విషయమై కోర్టు పరిధిలో ఉంది. తన కారణంగానే కోర్టు నోటీసులు వస్తున్నాయంటూ ఆరోపిస్తూ తన పేరు రాసి జలభాండాగారంపై నుంచి దూకి చనిపోతానని గురవరాజు బెదిరించడంతో రవిని కులంపేరుతో దూషించారు. రవి ఫిర్యాదు మేరకు గురువారం అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.