ములకలపల్లి మండలం నల్లివారిగూడెంకు చెందిన ఎస్. కే. నిషాన్ అనే యువతి ఈ నెల 22వ తేదీ రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో యువతి తల్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై ఎస్సై మధుప్రసాద్ వివరాలు తెలిపారు.