ములకలపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పోతుగంటి క్రాంతి గుండెపోటుతో సోమవారం కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మృతి స్థానిక పాత్రికేయులను, ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదివాసీల జీవనశైలిని వెలుగులోకి తీసుకురావడంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని పలువురు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.